ఊరంతా ఎంతో హడావిడి . పుష్కరాలు వచ్చేశాయ్ . ఎక్కడ చూసినా జనం జనo . అందరి దారీ గోదావరే . రోడ్లన్నీ కళకళ . రాత్రీ పగలూ వొకటే . కాంతి నిండిన ముఖాలు . కళ్ళనిండా సంతోషం . మా రోడ్లు ఎంతో శుభ్రం . స్వచ్ఛ భారత్ ప్రభావం బాగా కనబడుతోంది . ప్రతి పావుగంటకీ చీపుళ్ళు పట్టుకొని ఓపిగ్గా తుడుస్తున్నారు . సిటీ బస్సు లు రాత్రి కూడా పరుగులు తీస్తున్నాయ్ . ఘాట్లన్నీ కిక్కిరిసి పోతున్నాయ్ .
రాజమండ్రి రావలసిన జనం మధ్యలో యిరుక్కుపోతున్నారు . ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయ్ . గంటల తరబడి నిరీక్షణ . కష్టపడి చేరుకొంటే స్నానానికి క్యూ . పురోహితుల దోపిడీ . ఆటోల యిష్టారాజ్యం . టాక్సీల టాక్స్ . ట్రెయిన్ లో చోట్లు దొరకటం లెధు. కిటికీలు కూడా డోర్ లే .
యిన్ని యిబ్బందులు వున్నా యిది పన్నెండేళ్ళ కొకసారి వచ్చె పండగ . గోదావరి తన పిల్లలని చూసి మురిసిపోయే పర్వదినం . అంతా కలిసిమెలిసి జలకాలాడే ఉత్సవం .పేదా ధనికా ,ముసలీ పడుచూ ఆడా మగా తేడా లేకుండా వొకే చోట భక్తితో మునిగే మహొత్సవం .
పిత్రు దేవతల పిండ ప్రదానం మన సంస్కృతి లో వొక భాగం . వాళ్ళని తలుచుకొని వాళ్ళని ఆహ్వానించి మనం సమర్పించుకొనే పుణ్య క్రతువు . నమ్మకం ఎటున్నా నామస్మరణం అనుసరణీయం .
యిన్ని కష్టాలు పడినా చివరికి కలిగే ఆనందం ఎవరెస్ట్ ఎక్కిన వారికి కూడా కలగదేమో .
పెద్దవాళ్ళ కోరిక మేరకు మోసుకొని గోదావరి స్నానం చేయించే వ్యక్తులు శ్రవణ కుమార్ కన్నా తక్కువేం
కాదు . తొంభైఏళ్ళ తల్లి ని తీసుకువచ్చే డబ్భై ఏళ్ళ సంతానం ధన్యుల
https://www.youtube.com/watch?v=F6Rcn0bn3Hk