Friday, September 29, 2017

జవాబు లేని జీవితం

మొన్నటి వరకూ మన కళ్లముందు తిరిగిన వ్యక్తి హఠాత్తుగా మనకి దూరమై వెళ్లి పోతే జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇల్లు మారిపోయిన మనుషుల్లా మిగిలిన వారు కొత్త ఫీలౌతారు.ప్రతి అడుగూ సంశయమే.ధైర్యాన్ని కోల్పోయిన పిల్లలు మనసు చిక్కబట్టుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. పాపం భార్య అతి ఏహ్యమైన కార్యక్రమానికి కూడా తల ఒగ్గింది.తరతరాలుగా జరుగుతున్న ఈ హింస ఈ సారి కూడా కొనసాగింది. ఎన్ని ప్రశ్నలో చిన్నపిల్లలకు. సమాధానం దొరకదు.

Wednesday, August 23, 2017

ఈతరం ఇల్లాలు

పాత సంసారం సినిమా లో ఒక పాట ఉంటుంది..సంసారం సంసారం ప్రేమసుధాపూరం..అని.అందులో చరణం లో మొదటి వాక్యం
ఇల్లాలొనర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవ ..అని
అది ఈ కాలానికి వర్తించదు.నూటికి తొంభై మంది ఇల్లాళ్లు డబల్ డ్యూటీ చేస్తున్నారు. అంటే ఇల్లుబ్రోవడానికి తమ వంతు కృషి చేస్తున్నారు..చాలా సార్లు ఇంకా ఎక్కువ కూడా.అలాగే మగమహారాజులు కూడా వారి వంతు సాయం చేయడం న్యాయం
.ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.అర్ధనారీశ్వర తత్వం అర్ధమైతే అంతా సార్ధకమే.

Monday, April 10, 2017

ఎండాకాలం

ఏ ఏటికాఏడు వయసు పెరుగుతుంది కదా..ఓర్చుకుశక్తి తగ్గుతుంది అనుకొంటా. అందరు ముసలాళ్ళ లాగే "పుట్టిన తర్వాత ఇంత ఎండలు ఎప్పుడూ ఎరగమమ్మా "అనుకొంటున్నా.కొత్తగా ఏ.సీ ఒకటి అలవాటయింది. లోపల ఉన్నంతసేపూ సూర్యారావు గారి ఆటలు సాగవు."బయటకు రా నీ పని చెప్తా"అనుకుంటాడేమో..తలుపు తీయగానే కసి తీర్చుకుంటాడు.
"జ్యూస్ తాగకూడదా"అని అందరి ముక్తకంఠం...కానీ టీ రుచే వేరు.
ఈ హైదరాబాద్ లో చెమటలు మారిపోవు కనక కొంతవరకూ బాగా నే ఉంటుంది.
"ఈ పాటికి వర్షాలు పడిపోవాలి మరి"
అంటారు అందరూ.
పవర్ కట్ లేదు. జనరేటర్ తో ఏ.సీ పనిచేయదు గా.
నాకు మాత్రం ఏ.సీ కి అలవాటు పడకూడదనిపిస్తుంది.కానీ ఉన్న ప్రోవిజన్ ఉపయోగించకుండా ఉండటం ఎవరితరం?😁 .