చాలా రోజుల తరువాత మళ్లీ బ్లాగ్ తెరిచాను.పాతవి చదువుతుంటే ఎన్నో జ్ఞాపకాలు. కామెంట్స్ చదివి మురిసిపోవడం.కుటుంబం అంటే అర్థం ఇదేనేమో.ఆలోచనలు పంచుకుంటే కలిగే ఆనందం ఎన్ని కోట్ల ధనానికీ సరిపోదు. వయసు పెరుగుతుంది కానీ గత జ్ఞాపకాలు తలచుకుంటూ ఉంటే ఆ క్షణం లోనే ఆగిపోయింది అనిపిస్తుంది. ఈమధ్య మన పాత కవిసమ్మేళనాలు చదువుతుంటే ఎందరు కొత్తగా మన కుటుంబ నావ ని ఎక్కారో అనిపిస్తోంది. అలాగే మనలని విడిచి వెళ్లిన మన దగ్గర వాళ్లు మన మధ్యనే ఉన్న అనుభూతి.టెక్నాలజీ కి మనసారా నమస్కారం.