Sunday, July 19, 2015

Godavari

ఊరంతా ఎంతో హడావిడి . పుష్కరాలు వచ్చేశాయ్ . ఎక్కడ చూసినా జనం జనo . అందరి దారీ గోదావరే . రోడ్లన్నీ కళకళ . రాత్రీ  పగలూ  వొకటే . కాంతి నిండిన ముఖాలు . కళ్ళనిండా సంతోషం . మా రోడ్లు ఎంతో శుభ్రం . స్వచ్ఛ భారత్ ప్రభావం బాగా కనబడుతోంది . ప్రతి పావుగంటకీ చీపుళ్ళు పట్టుకొని ఓపిగ్గా తుడుస్తున్నారు . సిటీ బస్సు లు రాత్రి కూడా పరుగులు తీస్తున్నాయ్ . ఘాట్లన్నీ కిక్కిరిసి పోతున్నాయ్ .
రాజమండ్రి రావలసిన జనం మధ్యలో యిరుక్కుపోతున్నారు . ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయ్ . గంటల తరబడి నిరీక్షణ . కష్టపడి చేరుకొంటే స్నానానికి క్యూ . పురోహితుల దోపిడీ . ఆటోల యిష్టారాజ్యం . టాక్సీల  టాక్స్ . ట్రెయిన్  లో చోట్లు దొరకటం లెధు. కిటికీలు కూడా డోర్ లే .
యిన్ని యిబ్బందులు వున్నా యిది పన్నెండేళ్ళ కొకసారి వచ్చె పండగ . గోదావరి తన పిల్లలని చూసి మురిసిపోయే పర్వదినం . అంతా కలిసిమెలిసి జలకాలాడే ఉత్సవం .పేదా ధనికా ,ముసలీ పడుచూ ఆడా మగా తేడా లేకుండా వొకే చోట భక్తితో మునిగే మహొత్సవం .
పిత్రు దేవతల పిండ ప్రదానం మన సంస్కృతి లో వొక భాగం . వాళ్ళని తలుచుకొని వాళ్ళని ఆహ్వానించి మనం సమర్పించుకొనే పుణ్య క్రతువు . నమ్మకం ఎటున్నా నామస్మరణం అనుసరణీయం .
యిన్ని కష్టాలు పడినా చివరికి కలిగే ఆనందం ఎవరెస్ట్ ఎక్కిన వారికి కూడా కలగదేమో .
పెద్దవాళ్ళ కోరిక మేరకు మోసుకొని గోదావరి స్నానం చేయించే వ్యక్తులు శ్రవణ కుమార్ కన్నా తక్కువేం
కాదు  . తొంభైఏళ్ళ తల్లి ని తీసుకువచ్చే డబ్భై ఏళ్ళ సంతానం ధన్యుల
https://www.youtube.com/watch?v=F6Rcn0bn3Hk

Monday, May 11, 2015

hidden animal

మానవుడు ఎంతోగొప్ప వాడు  అని అనుకొంటాడు . విర్రవీగుతాడు .  కానీ చాలా బలహీనుడు.  యితర జంతువులు ఆపదలో తక్షణం స్పందిస్తాయ్ తడబాటు ఉండదు . పిల్లి అవసరమయితే పులి అవుతుంది . పిల్లల జోలికి వస్తే పీకుతుంది . పులి ఆకలి లేకపోతే పిల్లి అవుతుంది కానీ మనిషి అవసరం లేకపోయినా లోపలి జంతువును బయటకి ఆహ్వా నిస్తాడు.  వొక్కోసారి తోడేలు మరోసారి జిత్తులమారి నక్క . చూడగానే ఎవ్వరూ గ్రహించలేరు నమ్మించి మోసం చేయడంలో ఘనుడు .
అమాయక ఆడపిల్లలు దగ్గరకు రాగానే ముసుగు వేసుకొని నమ్మిస్తాడు . ముసుగు తీసి కాటేస్తాడు.
ఈ రోజుల్లో ఎన్నో అవకాశాలు . స్కూల్స్  లో  కాలేజీలలో అభం శుభం తెలియని లేత మొగ్గలు యిలాటి మేక వన్నె తోడేళ్ళ క్రూరత్వానికి బలి అవుతున్నారు . చట్టాలు మనుషులని మార్చలేవు . మనసులు మారితేకానీ రక్షణ దొరకదు . ఆడతనం అమ్మదనం అనే జ్ఞానం వుంటే ప్రతి మగాడూ అసలైన మగాడు . లేకపోతే మృగాడు . జనారణ్యం లో మృగాలే ఎక్కువ . అరణ్యం లో ముసుగు లేని మృగాలు తప్పించుకొనే అవకాశాన్ని ఇస్తాయి .
ప్రతీ  రోజూ ఎన్నో వార్తలు . పదహారేళ్ళ పిల్లలు పండు ముసలి ని పాడుచేసే జుగుప్సాకర సంఘటనలు . మరి వాళ్ళని బాల నేరస్తులని అనగలమా ?
చట్టం మారాలి . శిక్షలు వెంటనే అమలు జరగాలి . ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని మహిళా సంఘాలు నిరసించినా ఆచరణలో నీరసిస్తున్నాయ్ .
భారతమాత కన్న ఆడబిడ్డలు భయం లేకుండా బయటకి వచ్చే రోజులు ఎప్పుడు వస్తాయో అప్పుడే మహిళా లోకానికి నిజమైన స్వాతంత్ర్యం .
యిప్పుడు కన్నె పిల్లలకే కాదు ఆడతనానికే  రక్షణ కావాలి. గోమాత ని పూజించే దేశం మనది . వాళ్ళ జీవితాలని
 చించకండి . పురుషుల్లారా ఆలోచించండి .

Tuesday, April 28, 2015

Earth quake

ప్రకృతి ప్రకోపిస్తే మనిషి దూదిపింజ నీటిలో కొట్టుకుపోతాడు గాలిలో ఎగిరిపోతాడు భూమిలో కూరుకుపోతాడు 5 సెకను ల ముందు తెలుస్తుందిట భూకంపం వస్తుందని మనకి తెలిసే లోగా కాలం మించిపోతుంది విర్రవీగే మనిషి
వెర్రి వాడు మాత ముందు కుర్రవాడు వరదలూ తుఫానులూ మనకి సంకేతాలు పంపుతాయి కానీ భూకంపాలు
మూకవుమ్మడిగా ముంచేస్తాయ్ జపాన్ ఈ విషయం లో బాగా ముందుచూపుతో వుంది మిగతా దేశాలు యింకా జాగ్రత్తలు తీసుకోవడం లేదు
80 ఏళ్ళ తరవాత మన పొరుగు దేశం మనలాగే పేద దేశం భారీ నష్టాన్ని చవి చూసింది మన దేశం లో కూడా బీహార్ ఎక్కువ నష్ట పోయింది ఉత్తర ప్రదేశ్ బెంగాల్ కూడా
రాజమండ్రి చిన్న కంపనాలకే కంగారు పడింది
మానవ తప్పిదాలు ఎప్పటికప్పుడు నష్టాలని కలిగిస్తోనే ఉన్నాయి చెట్లు మన సంపద అయినా మన కొమ్మని మనమే నరికేస్తున్నాం భూమిలో నీటిని విచక్షణా రహితం గా తోదేస్తున్నాం చెరువులు చెరిగిపోతున్నాయ్ జలచరాలు జలదరిస్తున్నాయ్
మనం ఎప్పటికి మేలు కొంటాం .సానుభూతి చూపిస్తున్నాం ముందు జాగ్రత్త మర్చిపోతున్నాం
అడవుల్ని రక్షించాలి భూమాతని బ్రతికించాలి

Monday, April 27, 2015

depression

ఈ మధ్య నాకు బాగా వేదాంతం పెరుగుతోంది అనుకొంటున్నాను .ఏ పని చేద్దామన్నా మనసు రావటం లేదు . డిప్రెషన్ అని అనుమానం లేవగానే కాఫీ తాగి పేపర్ చదువుతాను .స్నానం చేసి మళ్ళా కాఫీ తాగి కూర్చుంటే చెయ్యడానికి  ఏ పనీ కనబడటం లేదు . టీవీ విసుగు వస్తోంది . టిఫిన్ తినే దాకా ఏదో కాలక్షేపం చేశాక అప్పుడు
మొదలవుతుంది అసలు విసుగు .ఛధువు మొదలు పెట్టాలి .ఎన్నొ పుస్తకాలు బాకీ వున్నాయి చదవడానికి .భక్తి
అలవాటు లేదు బయటకి వెళ్ళడానికి బద్ధకం . ప్రస్తుతం ఎండలు తొమ్మిది గంటలకే పెరిగి పోతున్నాయ్ . పక్కనే
కిరాణా షాప్ యిప్పుడు డెవలప్ చేశాడు .ఆన్నీ క్వాలిటీ సరుకులు దొరుకుతున్నాయ్ .
అందరికీ అలాగే అనిపిస్తోందో నా వొక్కడికో అర్ధం కావటం లేదు . యిదివరకు రాజమం డ్రి  విసుగు వచ్చేది కాదు
కంప్యూటర్ మంచి కాలక్షేపం .విసుగు రాదు . కానీ పక్కనున్న వాళ్లకి విసుగు 

Manasyna Song - Jayasimha Movie Songs - NTR - Savitri - Showkar Janaki

Sunday, March 29, 2015

Akka

చిన్నప్పుడు నేను అక్క వెనకాలే తిరుగుతూ వుండే వాడిని .ఆక్క కి అన్నీ తెలుసు నాకు తోడు అని నా నమ్మకం .ఆక్క నన్నెప్పుడూ విసుక్కోలేదు .బాగా గారం చేసేది .స్కూల్ కి జాగ్రత్త గా తీసుకెళ్ళేది .అయిపొయాక ఎప్పుడూ చెప్పడం మర్చిపోయి వచ్చెసె వాడిని .అక్క పెద్ద క్లాస్ కదా మాకు ముందు విడిచి పెట్టేవారు .ఇంటికి ఏడుస్తూ వచ్చేది ఎంత  బాధ పెట్టే వాడినో అప్పుడు తెలియదు  .
పెళ్లి అయ్యి వెళ్ళేటప్పుడు ఎంతో ఏడుపు వచ్చింది .ఒకే వూరు కదా కావాలనుకొన్నప్పుడు చూడచ్చు అంది అమ్మ మంచివాడు బావ ఆనందం గా గడిపే వాళ్ళు సంసారం సుఖం గా సాగింది .
పిల్లలు పెద్ద వాళ్లై ప్రయోజకులయ్యారు .హటాత్తు గా బావ మరణం అక్కకి అనారోగ్యం లేవలేక పోయేది .కొ డు కు కోడలు ఎంతో ఆదుకొన్నారు .
రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యింది .నా మకాం హైదరాబాద్ .మా వూరు వచ్చే లోగా కన్ను మూసింది క్రి తం యేడు 75 సంవత్సరాల పండుగ చేసుకొంది .నిoడు జీవితం గడిపింది నాన్నగారి సెంటినరీ కి తన స్పందన రాసింది .
అక్కా నువ్వెక్కడ వున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వుంటావని  మాకు తెలుసు