Sunday, July 4, 2021

ఒంటరి జీవితం

 09-11-2020 రాత్రి 10-30

నా కాలిమీద ఎవరో మృదువుగా తట్టి లేపుతున్నారు. 

అంతకు ముందు రెండు రోజుల క్రితం తనని హాస్పిటల్ లోఎడ్మిట్ చేశాం. బాగానే ఉంది. మర్నాడు ఇంటికి పంపించేస్తాం అన్నారు డాక్టర్ లు. 

కళ్లు తెరిచి చూస్తే ఫణి. 

అమ్మకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి పోతున్నాయి ట.డాక్టర్ రమ్మంటున్నారు 

అన్నాడు ఆందోళన గా. 

నాకు అర్థం ఐపోయింది. 

నన్ను వదిలి పెట్టి వెళ్లి పోయే సమయం వచ్చేసిందని. 

మనస్సు ఏడుస్తోంది కానీ కళ్లు పొడిగానే ఉన్నాయ్. 

దీనిని స్థితప్రజ్ఞత అంటారా? కఠిన హృదయం అంటారా? 

యాభై ఆరేళ్ల సాహచర్యం అప్పుడే తెగిపోతోందా? 

హడావిడిగా బయలుదేరాం.

రూమ్ నిశ్చేతనంగా ఉంది నా మనసు లాగ. 


ఇ. సి. జి బలహీనంగా , దీనంగా, అసహాయంగా నన్ను కాపాడు అన్నట్లు.. 

నేనేం చేయలేని పరిస్థితి. 

చివరి సారిగా గుడ్ బై అన్నట్టు.. 

ఒక తిన్నని సరళ రేఖ. 

ఓవర్ అన్నారు డాక్టర్.. 

అంతా అర్థంఔతోంది మనసు మాత్రం 'ఇది నిజం కాదేమో..కలేమో... మెలుకువ వచ్చాక హాస్పిటల్ కి వెళ్లి చూడాలి"

 అని లేని పోని ఆశలు కల్పిస్తోంది.. 




Friday, February 21, 2020

పుట్టిన రోజు

మరో పుట్టిన రోజు గడిచింది. డబ్భైఆరేళ్లు నిండాయ్. సింహావలోకనం చేసుకుంటే గీత ని కోల్పోవడం అనుకోని విషాదం. నా ఆరోగ్యం బాగున్నట్లే లెక్క. చిన్నచిన్న బాధలు తప్ప. ప్రయాణాలు చేసే ఓపిక లేదు. ఫణి ఇచ్చిన కొత్త instrument తో బాగా కాలక్షేపం ఔతోంది.నెమ్మదిగా ఎండలు  ముదురుతున్నాయ్.


Thursday, January 23, 2020

పాత జ్ఞాపకాలు-కొత్త ఊహలు

చాలా రోజుల తరువాత మళ్లీ బ్లాగ్ తెరిచాను.పాతవి చదువుతుంటే ఎన్నో జ్ఞాపకాలు. కామెంట్స్ చదివి మురిసిపోవడం.కుటుంబం అంటే అర్థం ఇదేనేమో.ఆలోచనలు పంచుకుంటే కలిగే ఆనందం ఎన్ని కోట్ల ధనానికీ సరిపోదు. వయసు పెరుగుతుంది కానీ గత జ్ఞాపకాలు  తలచుకుంటూ ఉంటే ఆ క్షణం లోనే ఆగిపోయింది అనిపిస్తుంది. ఈమధ్య మన పాత కవిసమ్మేళనాలు చదువుతుంటే ఎందరు కొత్తగా మన కుటుంబ నావ ని ఎక్కారో అనిపిస్తోంది. అలాగే మనలని విడిచి వెళ్లిన మన దగ్గర వాళ్లు మన మధ్యనే ఉన్న అనుభూతి.టెక్నాలజీ కి మనసారా నమస్కారం.

Friday, September 29, 2017

జవాబు లేని జీవితం

మొన్నటి వరకూ మన కళ్లముందు తిరిగిన వ్యక్తి హఠాత్తుగా మనకి దూరమై వెళ్లి పోతే జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇల్లు మారిపోయిన మనుషుల్లా మిగిలిన వారు కొత్త ఫీలౌతారు.ప్రతి అడుగూ సంశయమే.ధైర్యాన్ని కోల్పోయిన పిల్లలు మనసు చిక్కబట్టుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. పాపం భార్య అతి ఏహ్యమైన కార్యక్రమానికి కూడా తల ఒగ్గింది.తరతరాలుగా జరుగుతున్న ఈ హింస ఈ సారి కూడా కొనసాగింది. ఎన్ని ప్రశ్నలో చిన్నపిల్లలకు. సమాధానం దొరకదు.

Wednesday, August 23, 2017

ఈతరం ఇల్లాలు

పాత సంసారం సినిమా లో ఒక పాట ఉంటుంది..సంసారం సంసారం ప్రేమసుధాపూరం..అని.అందులో చరణం లో మొదటి వాక్యం
ఇల్లాలొనర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవ ..అని
అది ఈ కాలానికి వర్తించదు.నూటికి తొంభై మంది ఇల్లాళ్లు డబల్ డ్యూటీ చేస్తున్నారు. అంటే ఇల్లుబ్రోవడానికి తమ వంతు కృషి చేస్తున్నారు..చాలా సార్లు ఇంకా ఎక్కువ కూడా.అలాగే మగమహారాజులు కూడా వారి వంతు సాయం చేయడం న్యాయం
.ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.అర్ధనారీశ్వర తత్వం అర్ధమైతే అంతా సార్ధకమే.

Monday, April 10, 2017

ఎండాకాలం

ఏ ఏటికాఏడు వయసు పెరుగుతుంది కదా..ఓర్చుకుశక్తి తగ్గుతుంది అనుకొంటా. అందరు ముసలాళ్ళ లాగే "పుట్టిన తర్వాత ఇంత ఎండలు ఎప్పుడూ ఎరగమమ్మా "అనుకొంటున్నా.కొత్తగా ఏ.సీ ఒకటి అలవాటయింది. లోపల ఉన్నంతసేపూ సూర్యారావు గారి ఆటలు సాగవు."బయటకు రా నీ పని చెప్తా"అనుకుంటాడేమో..తలుపు తీయగానే కసి తీర్చుకుంటాడు.
"జ్యూస్ తాగకూడదా"అని అందరి ముక్తకంఠం...కానీ టీ రుచే వేరు.
ఈ హైదరాబాద్ లో చెమటలు మారిపోవు కనక కొంతవరకూ బాగా నే ఉంటుంది.
"ఈ పాటికి వర్షాలు పడిపోవాలి మరి"
అంటారు అందరూ.
పవర్ కట్ లేదు. జనరేటర్ తో ఏ.సీ పనిచేయదు గా.
నాకు మాత్రం ఏ.సీ కి అలవాటు పడకూడదనిపిస్తుంది.కానీ ఉన్న ప్రోవిజన్ ఉపయోగించకుండా ఉండటం ఎవరితరం?😁 .

Tuesday, March 8, 2016

అసహనం

ఈమధ్య ప్రతి వాళ్ళకీ ఈపదం వాడడంఅలవాటైపోయింది.మాట్లాడితే దేశం విడిచి పోతాం అని బెదిరిస్తున్నారు.మాతృభూమి అంటే ఏమిటో వీళ్ళకి తెలియడంలేదు.పక్కింట్లో పరవాన్నం ఎంత బాగున్నా మన గంజినీళ్ళు మన స్వంతం.దేశం మనకేమిచ్చింది అంటున్నారు కానీ మనం దేశానికి ఏమిచ్చాం అని ఆలోచించడం లేదు.యూనివర్శిటీలు రాజకీయవేదికలైపోయాయి.కులసంఘాలు విద్యార్ధి జీవితాలతో బంతాట ఆడుకొంటున్నాయ్.ప్రొఫెసర్లు విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు.రాజకీయనాయకులు కుళ్ళు
పెంచుతున్నారు.మళ్ళీ ఏ మహాత్ముడో పుట్టాలి.మన దేశాన్ని రక్షించాలి.

Sunday, July 19, 2015

Godavari

ఊరంతా ఎంతో హడావిడి . పుష్కరాలు వచ్చేశాయ్ . ఎక్కడ చూసినా జనం జనo . అందరి దారీ గోదావరే . రోడ్లన్నీ కళకళ . రాత్రీ  పగలూ  వొకటే . కాంతి నిండిన ముఖాలు . కళ్ళనిండా సంతోషం . మా రోడ్లు ఎంతో శుభ్రం . స్వచ్ఛ భారత్ ప్రభావం బాగా కనబడుతోంది . ప్రతి పావుగంటకీ చీపుళ్ళు పట్టుకొని ఓపిగ్గా తుడుస్తున్నారు . సిటీ బస్సు లు రాత్రి కూడా పరుగులు తీస్తున్నాయ్ . ఘాట్లన్నీ కిక్కిరిసి పోతున్నాయ్ .
రాజమండ్రి రావలసిన జనం మధ్యలో యిరుక్కుపోతున్నారు . ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయ్ . గంటల తరబడి నిరీక్షణ . కష్టపడి చేరుకొంటే స్నానానికి క్యూ . పురోహితుల దోపిడీ . ఆటోల యిష్టారాజ్యం . టాక్సీల  టాక్స్ . ట్రెయిన్  లో చోట్లు దొరకటం లెధు. కిటికీలు కూడా డోర్ లే .
యిన్ని యిబ్బందులు వున్నా యిది పన్నెండేళ్ళ కొకసారి వచ్చె పండగ . గోదావరి తన పిల్లలని చూసి మురిసిపోయే పర్వదినం . అంతా కలిసిమెలిసి జలకాలాడే ఉత్సవం .పేదా ధనికా ,ముసలీ పడుచూ ఆడా మగా తేడా లేకుండా వొకే చోట భక్తితో మునిగే మహొత్సవం .
పిత్రు దేవతల పిండ ప్రదానం మన సంస్కృతి లో వొక భాగం . వాళ్ళని తలుచుకొని వాళ్ళని ఆహ్వానించి మనం సమర్పించుకొనే పుణ్య క్రతువు . నమ్మకం ఎటున్నా నామస్మరణం అనుసరణీయం .
యిన్ని కష్టాలు పడినా చివరికి కలిగే ఆనందం ఎవరెస్ట్ ఎక్కిన వారికి కూడా కలగదేమో .
పెద్దవాళ్ళ కోరిక మేరకు మోసుకొని గోదావరి స్నానం చేయించే వ్యక్తులు శ్రవణ కుమార్ కన్నా తక్కువేం
కాదు  . తొంభైఏళ్ళ తల్లి ని తీసుకువచ్చే డబ్భై ఏళ్ళ సంతానం ధన్యుల
https://www.youtube.com/watch?v=F6Rcn0bn3Hk

Monday, May 11, 2015

hidden animal

మానవుడు ఎంతోగొప్ప వాడు  అని అనుకొంటాడు . విర్రవీగుతాడు .  కానీ చాలా బలహీనుడు.  యితర జంతువులు ఆపదలో తక్షణం స్పందిస్తాయ్ తడబాటు ఉండదు . పిల్లి అవసరమయితే పులి అవుతుంది . పిల్లల జోలికి వస్తే పీకుతుంది . పులి ఆకలి లేకపోతే పిల్లి అవుతుంది కానీ మనిషి అవసరం లేకపోయినా లోపలి జంతువును బయటకి ఆహ్వా నిస్తాడు.  వొక్కోసారి తోడేలు మరోసారి జిత్తులమారి నక్క . చూడగానే ఎవ్వరూ గ్రహించలేరు నమ్మించి మోసం చేయడంలో ఘనుడు .
అమాయక ఆడపిల్లలు దగ్గరకు రాగానే ముసుగు వేసుకొని నమ్మిస్తాడు . ముసుగు తీసి కాటేస్తాడు.
ఈ రోజుల్లో ఎన్నో అవకాశాలు . స్కూల్స్  లో  కాలేజీలలో అభం శుభం తెలియని లేత మొగ్గలు యిలాటి మేక వన్నె తోడేళ్ళ క్రూరత్వానికి బలి అవుతున్నారు . చట్టాలు మనుషులని మార్చలేవు . మనసులు మారితేకానీ రక్షణ దొరకదు . ఆడతనం అమ్మదనం అనే జ్ఞానం వుంటే ప్రతి మగాడూ అసలైన మగాడు . లేకపోతే మృగాడు . జనారణ్యం లో మృగాలే ఎక్కువ . అరణ్యం లో ముసుగు లేని మృగాలు తప్పించుకొనే అవకాశాన్ని ఇస్తాయి .
ప్రతీ  రోజూ ఎన్నో వార్తలు . పదహారేళ్ళ పిల్లలు పండు ముసలి ని పాడుచేసే జుగుప్సాకర సంఘటనలు . మరి వాళ్ళని బాల నేరస్తులని అనగలమా ?
చట్టం మారాలి . శిక్షలు వెంటనే అమలు జరగాలి . ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని మహిళా సంఘాలు నిరసించినా ఆచరణలో నీరసిస్తున్నాయ్ .
భారతమాత కన్న ఆడబిడ్డలు భయం లేకుండా బయటకి వచ్చే రోజులు ఎప్పుడు వస్తాయో అప్పుడే మహిళా లోకానికి నిజమైన స్వాతంత్ర్యం .
యిప్పుడు కన్నె పిల్లలకే కాదు ఆడతనానికే  రక్షణ కావాలి. గోమాత ని పూజించే దేశం మనది . వాళ్ళ జీవితాలని
 చించకండి . పురుషుల్లారా ఆలోచించండి .

Tuesday, April 28, 2015

Earth quake

ప్రకృతి ప్రకోపిస్తే మనిషి దూదిపింజ నీటిలో కొట్టుకుపోతాడు గాలిలో ఎగిరిపోతాడు భూమిలో కూరుకుపోతాడు 5 సెకను ల ముందు తెలుస్తుందిట భూకంపం వస్తుందని మనకి తెలిసే లోగా కాలం మించిపోతుంది విర్రవీగే మనిషి
వెర్రి వాడు మాత ముందు కుర్రవాడు వరదలూ తుఫానులూ మనకి సంకేతాలు పంపుతాయి కానీ భూకంపాలు
మూకవుమ్మడిగా ముంచేస్తాయ్ జపాన్ ఈ విషయం లో బాగా ముందుచూపుతో వుంది మిగతా దేశాలు యింకా జాగ్రత్తలు తీసుకోవడం లేదు
80 ఏళ్ళ తరవాత మన పొరుగు దేశం మనలాగే పేద దేశం భారీ నష్టాన్ని చవి చూసింది మన దేశం లో కూడా బీహార్ ఎక్కువ నష్ట పోయింది ఉత్తర ప్రదేశ్ బెంగాల్ కూడా
రాజమండ్రి చిన్న కంపనాలకే కంగారు పడింది
మానవ తప్పిదాలు ఎప్పటికప్పుడు నష్టాలని కలిగిస్తోనే ఉన్నాయి చెట్లు మన సంపద అయినా మన కొమ్మని మనమే నరికేస్తున్నాం భూమిలో నీటిని విచక్షణా రహితం గా తోదేస్తున్నాం చెరువులు చెరిగిపోతున్నాయ్ జలచరాలు జలదరిస్తున్నాయ్
మనం ఎప్పటికి మేలు కొంటాం .సానుభూతి చూపిస్తున్నాం ముందు జాగ్రత్త మర్చిపోతున్నాం
అడవుల్ని రక్షించాలి భూమాతని బ్రతికించాలి

Monday, April 27, 2015

depression

ఈ మధ్య నాకు బాగా వేదాంతం పెరుగుతోంది అనుకొంటున్నాను .ఏ పని చేద్దామన్నా మనసు రావటం లేదు . డిప్రెషన్ అని అనుమానం లేవగానే కాఫీ తాగి పేపర్ చదువుతాను .స్నానం చేసి మళ్ళా కాఫీ తాగి కూర్చుంటే చెయ్యడానికి  ఏ పనీ కనబడటం లేదు . టీవీ విసుగు వస్తోంది . టిఫిన్ తినే దాకా ఏదో కాలక్షేపం చేశాక అప్పుడు
మొదలవుతుంది అసలు విసుగు .ఛధువు మొదలు పెట్టాలి .ఎన్నొ పుస్తకాలు బాకీ వున్నాయి చదవడానికి .భక్తి
అలవాటు లేదు బయటకి వెళ్ళడానికి బద్ధకం . ప్రస్తుతం ఎండలు తొమ్మిది గంటలకే పెరిగి పోతున్నాయ్ . పక్కనే
కిరాణా షాప్ యిప్పుడు డెవలప్ చేశాడు .ఆన్నీ క్వాలిటీ సరుకులు దొరుకుతున్నాయ్ .
అందరికీ అలాగే అనిపిస్తోందో నా వొక్కడికో అర్ధం కావటం లేదు . యిదివరకు రాజమం డ్రి  విసుగు వచ్చేది కాదు
కంప్యూటర్ మంచి కాలక్షేపం .విసుగు రాదు . కానీ పక్కనున్న వాళ్లకి విసుగు 

Manasyna Song - Jayasimha Movie Songs - NTR - Savitri - Showkar Janaki

Sunday, March 29, 2015

Akka

చిన్నప్పుడు నేను అక్క వెనకాలే తిరుగుతూ వుండే వాడిని .ఆక్క కి అన్నీ తెలుసు నాకు తోడు అని నా నమ్మకం .ఆక్క నన్నెప్పుడూ విసుక్కోలేదు .బాగా గారం చేసేది .స్కూల్ కి జాగ్రత్త గా తీసుకెళ్ళేది .అయిపొయాక ఎప్పుడూ చెప్పడం మర్చిపోయి వచ్చెసె వాడిని .అక్క పెద్ద క్లాస్ కదా మాకు ముందు విడిచి పెట్టేవారు .ఇంటికి ఏడుస్తూ వచ్చేది ఎంత  బాధ పెట్టే వాడినో అప్పుడు తెలియదు  .
పెళ్లి అయ్యి వెళ్ళేటప్పుడు ఎంతో ఏడుపు వచ్చింది .ఒకే వూరు కదా కావాలనుకొన్నప్పుడు చూడచ్చు అంది అమ్మ మంచివాడు బావ ఆనందం గా గడిపే వాళ్ళు సంసారం సుఖం గా సాగింది .
పిల్లలు పెద్ద వాళ్లై ప్రయోజకులయ్యారు .హటాత్తు గా బావ మరణం అక్కకి అనారోగ్యం లేవలేక పోయేది .కొ డు కు కోడలు ఎంతో ఆదుకొన్నారు .
రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యింది .నా మకాం హైదరాబాద్ .మా వూరు వచ్చే లోగా కన్ను మూసింది క్రి తం యేడు 75 సంవత్సరాల పండుగ చేసుకొంది .నిoడు జీవితం గడిపింది నాన్నగారి సెంటినరీ కి తన స్పందన రాసింది .
అక్కా నువ్వెక్కడ వున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వుంటావని  మాకు తెలుసు

Tuesday, November 11, 2014

bengaluru winter

Winter of Bengalutu used to be very pleasant during past days. But this year no such feeling.Mornings are as usual.No cool breeze. Days are hot. Sun shining brilliant. Like summer. What happened to this city?Very much disgusting.Can we see olden days again?


Wednesday, May 7, 2014

Araajakeeyaalu

నిన్న వోటు వేశాం ఎంత అరాజకీయం . డబ్బుల పందేరం .ఫంచలెధని అలకలూ వోటర్ దేవుడు అమ్ముడుపోతున్నాడు అభ్యర్ధులు   కొనుక్కుంటున్నారు సిగ్గు లేని ప్రజలు ఎన్నాళ్లు యిలా మనం మారం ఒక్కటి మాత్రం నిజం మార్పు వస్తోంది ప్రజలు నిధ్ర లేచారు బహుపరాక్ 

Tuesday, July 30, 2013

cheelika

అనుకున్నంతా జరిగింది . తెలుగుతల్లి మె డమీద వేటు పడింది .కన్నీళ్ళు రాలినా కనికరించని పాలకులు అడ్డుగోడ పెడదామనుకొంటున్నారు . తమ్ముళ్ళు విడిపోదామనుకొంటే అన్నలు అడ్డు పడకూడదు కదా . అయినా చివరి ప్రయత్నం చేస్తున్నారు.నమ్మకo లేకపోయినా . అంతా రాజకీయం .యిరుగు పొరుగు వాళ్ళు విడగొడదామని శాయశక్తులా ప్రయత్నించి విజయం సాధించారు .ఆన్న తమ్ముడి యింట్లో పదేళ్ళ పాటు వుండచ్చుట .ఈ లోగా కొత్తయిల్లు కట్టుకోవాలట . యివన్నీ ఎవరు నిర్ణయించారు ?పరాయి వాళ్ళు . మన పొరుగు వాళ్ళు . వాళ్ళ యిల్లు మాత్రం పదిలంగా వుండాలి . మధ్యగోడ ఉండకూడదు . తమ్ముడు అన్నకి భరోసా యిస్తున్నాడుఅన్నని వాళ్ళింట్లో వుంటే కొట్టడుట   .హామీ ఇస్తున్నాడు . 
తల్లి  ఏం చేయగలదు .కన్నీల్లు పెట్టుకోవడం తప్ప . 
వోట్ల రాజకీయం జిందాబాద్ 

Sunday, June 30, 2013

Back to home

రాజమండ్రి తిరిగి వచ్చాం .హైదరాబాద్ లో నెల రోజులు గడిపి పిల్లలతో ఆడుకొని మేమిద్దరం వొంటరిగా ఊరు చేరాం .యిక్కడ పనులు ఉన్నాయికదా ..తప్పనిసరి జీవితం.  మళ్ళీ రొటీన్ . వర్షాలు . బురద . ఉక్క . ఇల్లంతా శుభ్రం చేసుకొని పాత కార్యక్రమాలు మొదలుపెట్టాం . ఎన్నో పనులు . చాలా టైం . స్టార్టింగ్ ట్ర బ్ల్ . వొక్కొక్క పనీ వరసగా 
చెయ్యాలి . మళ్ళీ ఎన్నాళ్ళో తెలియదు . అంతవరకూ వేచి వుండాలి . కానీ వొకందుకు ఆనందం . యిప్పుడు రెండు స్వంత ఊర్లు . వొకటి పుట్టి పెరిగినది . మరొకటి చిట్ట చివరిది , 

Thursday, May 16, 2013