Monday, May 11, 2015

hidden animal

మానవుడు ఎంతోగొప్ప వాడు  అని అనుకొంటాడు . విర్రవీగుతాడు .  కానీ చాలా బలహీనుడు.  యితర జంతువులు ఆపదలో తక్షణం స్పందిస్తాయ్ తడబాటు ఉండదు . పిల్లి అవసరమయితే పులి అవుతుంది . పిల్లల జోలికి వస్తే పీకుతుంది . పులి ఆకలి లేకపోతే పిల్లి అవుతుంది కానీ మనిషి అవసరం లేకపోయినా లోపలి జంతువును బయటకి ఆహ్వా నిస్తాడు.  వొక్కోసారి తోడేలు మరోసారి జిత్తులమారి నక్క . చూడగానే ఎవ్వరూ గ్రహించలేరు నమ్మించి మోసం చేయడంలో ఘనుడు .
అమాయక ఆడపిల్లలు దగ్గరకు రాగానే ముసుగు వేసుకొని నమ్మిస్తాడు . ముసుగు తీసి కాటేస్తాడు.
ఈ రోజుల్లో ఎన్నో అవకాశాలు . స్కూల్స్  లో  కాలేజీలలో అభం శుభం తెలియని లేత మొగ్గలు యిలాటి మేక వన్నె తోడేళ్ళ క్రూరత్వానికి బలి అవుతున్నారు . చట్టాలు మనుషులని మార్చలేవు . మనసులు మారితేకానీ రక్షణ దొరకదు . ఆడతనం అమ్మదనం అనే జ్ఞానం వుంటే ప్రతి మగాడూ అసలైన మగాడు . లేకపోతే మృగాడు . జనారణ్యం లో మృగాలే ఎక్కువ . అరణ్యం లో ముసుగు లేని మృగాలు తప్పించుకొనే అవకాశాన్ని ఇస్తాయి .
ప్రతీ  రోజూ ఎన్నో వార్తలు . పదహారేళ్ళ పిల్లలు పండు ముసలి ని పాడుచేసే జుగుప్సాకర సంఘటనలు . మరి వాళ్ళని బాల నేరస్తులని అనగలమా ?
చట్టం మారాలి . శిక్షలు వెంటనే అమలు జరగాలి . ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని మహిళా సంఘాలు నిరసించినా ఆచరణలో నీరసిస్తున్నాయ్ .
భారతమాత కన్న ఆడబిడ్డలు భయం లేకుండా బయటకి వచ్చే రోజులు ఎప్పుడు వస్తాయో అప్పుడే మహిళా లోకానికి నిజమైన స్వాతంత్ర్యం .
యిప్పుడు కన్నె పిల్లలకే కాదు ఆడతనానికే  రక్షణ కావాలి. గోమాత ని పూజించే దేశం మనది . వాళ్ళ జీవితాలని
 చించకండి . పురుషుల్లారా ఆలోచించండి .